విద్యార్ధులకు తక్షణం బకాయిలు విడుదల చేయాలి

0
117
రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఎంపి హర్షకుమార్‌ డిమాండ్‌
రాజమహేంద్రవరం, ఆగస్టు 21 :  కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్‌మెంటుతోపాటు, మెస్‌ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎంపీ, రాజీవ్‌గాంధీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు జివి హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక రాజీవ్‌గాంధీ విద్యా సంస్థలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్‌మెంటు, మెస్‌ ఛార్జీల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఫలితంగా విద్యార్థులతోపాటు, ఆయా కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. కళాశాల యాజమాన్యాలైతే కనీసం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి నెట్టబడుతున్నాయని అన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం కూడా తీవ్ర జాప్యం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణితో ముందుకు వెళ్తుందని ఆరోపించారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను పక్కన పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడి రీతిలో వ్యవహరించడం సరికాదని, తక్షణమే ఫీజురియంబర్స్‌మెంటు, మెస్‌ ఛార్జీలను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here