విద్యార్ధులకు బూట్లు, బ్యాగ్‌ల పంపిణీ

0
306
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 : నేషనల్‌ సీనియర్‌ బేసిక్‌ స్కూల్‌లోని విద్యార్ధులకు ఇటీవల బూట్లు, సాక్సులు, బ్యాగ్‌లు పంపిణీ చేశారు. చందా సత్రం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పి.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా 31 వ డివిజన్‌ కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నగర మాజీ అధ్యక్షులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, ప్రధానోపాధ్యాయులు బెన్‌సన్‌, స్కూల్‌ మాజీ చైర్మన్‌ మజ్జి అప్పారావు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యల గోపి, తదితరులు పాల్గొన్నారు.