విద్యార్ధులకు స్టడీ కిట్‌ పంపిణీ  

0
270
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 : స్ధానిక 5వ  డివిజన్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం 1ని ఇటీవల ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ తలారి ఉమాదేవి  సందర్శించారు. సాంఘిక సంక్షేమ శాఖ సరఫరా చేసిన  రెండు జతల ఏకరూప దుస్తులను, స్కూల్‌ బ్యాగ్‌లను, జామెట్రి బాక్స్‌లను,డ్రాయింగ్‌ పుస్తకాలను, పెన్నులను, మ్యాప్‌ పాయింట్‌ బుక్‌లను ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్ధులు చదువులో రాణించి జీవితంలో స్ధిరపడాలని ఆమె వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు తలారి భగవాన్‌, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి కె.డేవిడ్‌ రాజు,  వసతి గృహ సంక్షేమ అధికారి కుప్పాల వీరభద్రరావు, కళాశాల వసతి గృహ హెచ్‌డబ్ల్యుఓలు జి.జాన్‌బాబు, పి.కళ్యాణిరాణి, కె.లోవలక్ష్మీ , సిబ్బంది వీరబాబు, రమేష్‌బాబు  పాల్గొన్నారు.