విద్యార్ధులు అన్ని రంగాల్లో రాణించాలి : గన్ని 

0
404
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 10 : విద్యార్ధులు విద్యతోపాటు చిత్రలేఖనం, భరతనాట్యం, జి.కె., ఇతర విభాగాల్లో నైపుణ్యం సంపాదించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమండ్రి, ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ రాజమండ్రి సంయుక్తంగా గతనెలలో నిర్వహించిన యువజన వారోత్సవాలలో 150 విద్యాసంస్థలకు చెందిన 600 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొని కూచిపూడి, భరతనాట్యం, చిత్రలేఖనం, అన్నమాచార్య కీర్తనలు, ఇతర పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. వారికి ఆదివారం సాయంత్రం గన్ని కృష్ణ చేతులమీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పట్టపగలు వెంకట్రావు, సీతారామ మహేశ్వరి, పట్టపగలు ప్రకాశరావు, ఎన్‌.వి.అప్పారావు, పట్టపగలు అనంత రామలక్ష్మి పాల్గొన్నారు.