విద్యా సంస్థలకు పచ్చని హారం

0
359
24న సుబ్రహ్మణ్య మైదానంలో 45వేల మొక్కల పంపిణీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 22 : గత ఏడాది ప్రయివేట్‌ కళాశాలల విద్యార్థులకు పండ్ల మొక్కలు పంపిణీ చేశామని, అదేవిధంగా ఈ ఏడాది ప్రయివేటు కాలేజీలు,పాఠశాలలతో పాటు మున్సిపల్‌ స్కూల్స్‌ కి కూడా ఈనెల 24వ తేదీ ఉదయం  మొక్కలు అందజేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి  అప్పారావు చెప్పారు. రాజమహేంద్రి మహిళా కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌, ప్రయివేట్‌ కాలేజీల అసోసియేషన్‌ నాయకులు టి కె విశ్వేశ్వర రెడ్డి, మెగా చౌదరి, ప్రగతి మురళి, ఆదిరెడ్డి వాసులతో  ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉసిరి,నిమ్మ,దానిమ్మ,జామ,కొబ్బరి, పనస వంటి పండ్ల మొక్కలను 45వేల వరకూ ఈ ఏడాది ఉచితంగా అందజేయాలని నిర్ణయించామన్నారు. గత ఏడాది కూడా ఇలాగే 45వేల మొక్కలు అందిస్తే, చాలామంది విద్యార్థులు తమతమ పెరటిలో వేసుకుని సక్రమంగా పెంచుతున్నారని,కాలేజీల తరపున గ్రీన్‌ క్లబ్‌ ల ద్వారా పర్యవేక్షణ కూడా చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేసారు. పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న క షిలో భాగంగా తమవంతు చేయూతనందిస్తున్నామని ఆయన చెప్పారు. ఎవరికెన్ని మొక్కలు కావాలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్‌,కళాశాల ప్రిన్సిపాల్‌ నుంచి లేఖ తెచ్చుకుంటే అందజేస్తామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర  ఆనం కళాకేంద్రంలో సభ నిర్వహించి, సుబ్రహ్మణ్యం మైదానంలో మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ  ప్రస్తుతం యాంత్రిక యుగంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎఫెక్షన్‌ తగ్గిపోతోందని,ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు నాటి,వాటిపట్ల ఆప్యాయత పెంచుకుంటే, తద్వారా సమాజంపట్ల బాధ్యత కూడా పెరుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here