విద్యోన్నతి స్కీమ్‌’ బి.సి. విద్యార్థులకు గుదిబండ కారాదు : కేసన హితవు 

0
349
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : ”ఎన్‌.టి.ఆర్‌. విద్యోన్నతి స్కీమ్‌” క్రింద ఎంపికై, అవస్థల పాలవుతున్న బి.సి. విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేవ్‌ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు డిమాండ్‌ చేశారు.  జిల్లా బీసీ యువజన సంఘం ప్రధాన కార్యాలయం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన కేశన శంకరరావు మాట్లాడుతూ 2015లో రాష్ట్ర ప్రభుత్వ ”ఎన్టీఆర్‌ విద్యోన్నతి స్కీమ్‌”ను ప్రారంభించి, తద్వారా సర్వీస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించిందని, ఈ ఉచిత శిక్షణకోరే అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు ప్రముఖ విద్యా సంస్థల ద్వారా ఈ స్కీమ్‌ క్రింద సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు తొమ్మిది నెలలు ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ ఇవ్వాలనే నిర్ణయించేశారని, అయితే స్కీమ్‌ మంచిదైనా ఆచరణలో లోటుపాట్లకు గురయి గత ఏడాది ఈ స్కీమ్‌ ద్వారా ఎంపికై హైదరాబాదు, ఢిల్లీలలోని ప్రముఖ కోచింగ్‌ సెంటర్లలో ఫ్రీ కోచింగ్‌ పొందుతున్న అభ్యర్థులకు అనేక ఇబ్బందులు కలిగాయని, ముఖ్యంగా సరైన సమయంలో కోచింగ్‌ సెంటర్లకు ఫీజు మొత్తం అందకపోవడం, ప్రిలిమ్స్‌ మరియు మెయిన్స్‌ కు ఇవ్వవలసిన మొత్తం ఖర్చు ఏ స్థాయిలో, ఎంత మొత్తాన్ని ఇవ్వాలనే స్పష్టత లేకపోయాయని ఆయన తెలిపారు. అలాగే అభ్యర్థి జీవన నిర్వహణకోసం ఇచ్చే ఉపకార వేతనం సకాలంలో అతని బ్యాంకు ఖాతాకు జమ చేయకపోవటం, అభ్యర్థుల ఎంపికలో జాప్యం వల్ల సకాలంలో అభ్యర్థులు తరగతులకు హాజరు కాలేక పోయారని అభ్యర్థులను కోచింగ్‌ సెంట్లరకు అనుమతించకుండా మెటీరియల్స్‌ ను ఇవ్వకపోవటం కారణాల వల్ల సత్ఫలితాలు సాధించలేకపోయినట్లు ఆయన తెలిపారు. బి, సి, విద్యార్థుల ఇబ్బందుల నివారణకు, కోచింగ్‌ సెంటర్లకు ఇచ్చే డబ్బు మొదటి భాగం అభ్యర్థి చేరిన 15 రోజులలోపు కోచింగ్‌ సెంటర్ల ఖాతాలలో జమ చేసేలా చూడాలని, అభ్యర్థి హాజరు, కోచింగ్‌ నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, చెల్లించవలసిన మొత్తంలో రెండవ భాగాన్ని మూడు నెలల లోపల, మిగిలిన మొత్తం ఆరు నెలలలోపు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్‌ మాట్లాడుతూ ఉపకారవేతనం క్రమం తప్పకుండా, ప్రతినెల ప్రారంభానికి ముందే, అభ్యర్థి బ్యాంకు ఖాతాలో చెల్లించాలని, కోచింగ్‌ కాలంలో తొమ్మిది నెలలు గడిచిన తరువాత కూడా కనీస ఉపకార వేతనాన్ని మరో ఆరు నెలల వరకు పొడిగించాలని ఆయన కోరారు. అభ్యర్థుల ఎంపిక, కోచింగ్‌ సెంటర్లో చేర్చే ప్రక్రియలు కనీసం ప్రిలిమ్స్‌ పరీక్షకు ముందు సంవత్సరం జూన్‌ నెలకు పూర్తి చేయాలని ప్రభుత్వం చెల్లించే ఫీజు మొత్తం కేవలం ప్రిలిమ్స్కేకాక, మెయిన్స్‌ కు కూడా చెల్లుతుందని స్పష్టత కోచింగ్‌ సెంటర్లకు ఇవ్వాలని, ప్రభుత్వ పధకమైన ఈ స్కీమ్న వ్యాపారపరంగా భావించకుండా పది హేను శాతం ఓ, ఎస్‌, టి, మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు సమున్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ మంచిదయినా, ఆచరణలో కలుగుతున్న లోటుపాట్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నివారించకపోతే సదుద్దేశ్యంతో ప్రారంభించిన స్కీమ్‌ నిరుపయోగంగా మారే ప్రమాదముందని కేసన హెచ్చరించారు. నాయకులు మార్గాని నాగేశ్వరావు, రామకృష్ణ గౌడ్‌, నరవ గోపాలకృష్ణ, మజ్జి అప్పారావు, ఉల్లూరి రాజు, విత్తనాల శివవెంకటేష్‌, కందికొండ అనంత తదితరులు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here