విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత భద్రతా ముఖ్యమే 

0
84
టీవీ-5 తాతాజీ సంతాప సభలో పాత్రికేయులు
రాజమహేంద్రవరం,ఆగస్టు 13 : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టివి-5 ఛానల్‌ తూర్పు గోదావరి జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ కాసారపు తాతాజీ స్మృతికి పలువురు పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారధి అధ్యతన గణేష్‌చౌక్‌లోని  ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు తాతాజీ సంతాప సభను నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన సీసీసీ ఎండి పంతం కొండలరావు, సీనియర్‌ పాత్రికేయులు పెద్దాడ నవీన్‌, జిఎ భూషణ్‌బాబు, విఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, మండెల శ్రీరామ్మూర్తి, జి.శ్రీనివాస్‌, వాడ్రేవు దివాకర్‌, టి.రామ్‌నారాయణ తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న బీమా పథకాలను అందిపుచ్చుకుని కుటుంబ సభ్యులకు ఆసరా లభించేలా చూసుకోవాలని కోరారు. తాతాజీ విధి నిర్వహణలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. 37 సంవత్సరాల చిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం బాధాకరమన్నారు. అతడికి భార్య, ఆరు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నారని, ఇప్పుడు వారిని ఆదుకునే పెద్ద దిక్కును కోల్పోయి రోధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వృత్తి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించే తాతాజీ మరణం జర్నలిస్టులకు తీరని లోటని శ్లాఘించారు. గతంలో ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్‌ శ్రీహరిని కూడా ఇదే విధంగా రోడ్డు ప్రమాదంలో కోల్పోయామని గుర్తుచేసారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. తాతాజీ చిత్రపటానికి పుష్పాలు అర్పించి అమర్‌ రహే అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి  తెలియజేస్తూ తాతాజీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, కెమేరామేన్లు హాజరయ్యారు. ఎన్‌టివి శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌, రాంబాబు, ఇలియాస్‌, భూషణం, హరిగణేష్‌, పందిరి సురేష్‌, తలుపులరావు, శ్రీనివాస్‌, సతీష్‌, రాజేశ్వరరావు, పాలపర్తి శ్రీనివాస్‌, తిరుమల, నారాయణ, ఆనంద్‌, కృష్ణ, ప్రసాద్‌, కృపానందం, చేబోలు రాజు, దుర్గ, ప్రసాద్‌, సోమరాజు, జ్యోతి సారధి, కళాధర్‌, గణేష్‌, విశ్వనాధ్‌, రాజేష్‌, మురళీ,  గోపి, ఆర్‌కె, గజరావు వెంకటేశ్వరరావు, పురుషోత్తం, గోపాలకృష్ణ, సుబ్బారావు, సుబ్బు, రమేష్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here