వినియోగదారుల హక్కుల పరిరక్షణే ఆశ్రా లక్ష్యం

0
264

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 : హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు హక్కులకు భంగం కలిగి నష్టపోతున్న వినియోగదారులకు ఆశ్రా ద్వారా ఉచిత న్యాయసహకారం అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఆశ్రా ఫౌండర్‌ న్యాయవాది హాబీబ్‌ సుల్తాన్‌ అలీ తెలిపారు.ఆశ్రా ద్వారా దేశం మొత్తం కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యవర్గాన్ని విస్తరించడానికి జిల్లాలో ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి వినియోగదారుల ఫోరం అధ్యక్షులు డి.లీలావతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిధిగా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ దొండపాటి సత్యంబాబు పాల్గొని ఇలాంటి సంస్థల ద్వారా వినియోగదారులకు మంచి లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రా జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా లక్ష్మణరావు ,ఉపాధ్యక్షులుగా వాసు,కార్యదర్శిగా ఈశ్వరాచారి, ఉపకార్యదర్శిగా న్యాయవాది రామలింగారెడ్డి నియమితులయ్యారు. రాజమహేంద్రవరం డివిజన్‌ ప్రెసిడెంట్‌గా నగేష్‌ను,అమలాపురం డివిజన్‌ ప్రెసిడెంట్‌గాఉమా మహేశ్వరరావును నియమించారు. ఆశ్రా రాష్ట్ర అధ్యక్షులు చెన్నూరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 550 మంది వినియోగదారులతో పాటు ఆశ్రా నేషనల్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here