విమర్శకుల నోళ్ళు మూతపడాలంటే

0
417
లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలి
తెదేపా సమావేశంలో గన్ని కృష్ణ ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం
త్వరలో ఫ్లై ఓవర్లు వస్తున్నాయి : మురళీమోహన్‌
గైర్హాజరీపై గోరంట్ల ఆగ్రహం-అభివృద్ధిపై వైకాపా దుష్ప్రచారం: ఆదిరెడ్డి
ాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : రాష్ట్ర మంత్రివర్గంలోకి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను తీసుకోవాలని రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ చేసిన ప్రతిపాదనను రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బలపర్చడంతో ఏకగ్రీవంగా ఆమోదించి పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపారు. నగర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు విఎల్‌పురం సమీపంలోని కమ్యూనిటీహాలులో నిర్వహించారు. రూరల్‌  ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడి ్డ రాంబాబు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు తదితరులు హాజరయ్యారు.  వచ్చే నెల 1 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని, మరో మారు పార్టీ సభ్యత్వాలను ఉత్సాహంగా నిర్వహించాలని తెదేపా నాయకులు సమావేశంలో పిలుపు ఇచ్చారు.  తొలుత డివిజన్ల అధ్యక్షులు, కొంతమంది కార్పొరేటర్లు హాజరు కాకపోవడంపై గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసే ఆసక్తి లేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మండిపడ్డారు.  సమావేశంలో ఎంపి మురళిమోహన్‌ మాట్లాడుతూ అనైతికంగా రాష్ట్రాన్ని విభజించిన తరుణంలో చంద్రబాబునాయుడు పరిపాలనా దక్షతను గుర్తెరిగి ప్రజలు పట్టం కట్టారని అన్నారు.జీతాలు ఇవ్వడం అసాధ్యమైన పరిస్థితిలో ఏనాడూ ఆ లోటు రాకుండా ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలు ముందుకొస్తుంటే కాలుష్యం పేరుతో వారిని బెదిరించడం వల్ల యువతకు ఉపాధి ఎలా లభిస్తుందన్నారు.అభివృద్ధి కోసం పరితపిస్తున్న చంద్రబాబుపై విమర్శలు మానాలన్నారు. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ప్రకటించడం ఆనందంగా ఉందని, త్వరలో మరిన్ని మార్పులు కలుగుతాయన్నారు. ప్రమాదాలను నివారించేందుకు గాను దివాన్‌చెరువు, లాలాచెరువు, మోరంపూడి, వేమగిరి ముఖ్య కూడళ్ళలో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి అంతా సిద్ధమవుతోందన్నారు. విశాఖపట్టణం, విజయవాడ విమానాశ్రయాలకు ధీటుగా మధురపూడి  విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో ఉత్పత్తవుతున్న వస్తువులనే వినియోగించి వారిని ప్రోత్సహించాలన్నారు. గోరంట్ల మాట్లాడుతూ వచ్చే నెలలో జన చైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, పథకాల అమలులో జరుగుతున్న లోపాలను అడ్డుకుంటామన్నారు.చైతన్య యాత్రలను విజయవంతం చేసి సభ్యత్వాల నమోదులో మరోసారి సత్తా చాటాలన్నారు. పందులు, కుక్కలు నిర్మూలనకు కౌన్సిల్‌లో ఓ తీర్మానం చేశామని, అయితే కొంతమంది వ్యక్తులు దీనిపై ధర్నాలు చేయడం సరికాదన్నారు.  ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలని, పేదవారికి సంజీవినిలా చంద్రన్న బీమా భరోసా కల్పిస్తుందన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ నారా లోకేష్‌ గత పదేళ్ళుగా పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయడంతో పాటు అధునాతన సాంకేతికతను అందుకుంటూ సభ్యత్వ నమోదు, ఇతర అంశాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు.ఒక వైపు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ మరో వైపు కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణాలో కెసిఆర్‌కు కెటిఆర్‌ ఏ విధంగా కుడి భుజంలా ఉంటున్నారో అలాగే లోకేష్‌ రాణించాలని అందుకు లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ తరఫున తీర్మానం చేసి పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించగా పార్టీ శ్రేణులు కరతాళ ధ్వనులతో ఆమోదించారు. ఎవరి ప్రాపకం కోసమో ఈ ప్రతిపాదనను చేయడం లేదని, ఆధునిక భావాలను పుణికిపుచ్చుకుని పార్టీ కోసం, ప్రజల కోసం శ్రమిస్తున్న యువనేతను క్యాబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా విమర్శకుల నోళ్ళను మూయించినట్టు అవుతుందన్నారు. లోకేష్‌ ప్రతిభకు ప్రతిపక్షాలు భయాందోళనకు గురవుతున్నందున ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన పార్టీ శిక్షణా కార్యక్రమంలో లోకేష్‌, రాజప్పల హావభావాలను చూసి సోషల్‌ మీడియాలో, జగన్‌ పత్రికలో దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని 2019 నాటికి అగ్ర స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు కంకణబద్ధులై ఉన్నారన్నారు. 2013లో సుమారు 2,800 కిలో మీటర్లు పా దయాత్ర చేసి ప్రజల అవసరాలను గురె ్తరిగి ఇపుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ  వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్న జనచైతన్య, పార్టీ సభ్యత్వ నమోదును విజ యవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుని దుష్ప్రచారం చేసేందుకు వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.  ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, యార్లగడ్డ శేఖర్‌, కురగంటి సతీష్‌, యేలూరి వెంకటేశ్వరరావు, రెడి ్డ మణి, మజ్జి రాంబాబు, రాచపల్లి ప్రసాద్‌, నిమ్మలపూడి గోవింద్‌, బుడ్డిగ రాధ, శెట్టి జగదీష్‌, మండవిల్లి శివ, బొచ్ఛా శ్రీను, కెవైఎన్‌ బాబు, మహబూబ్‌ జానీ, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, కంచిపాటి గోవింద్‌, బెజవాడ వెంకటస్వామి, మళ్ళ వెంకట్రాజు, విశ్వనాధరాజు తదితరులు పాల్గొన్నారు.