25న జిత్‌మోహన్‌మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారం

0
391
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 23 : దాదాపు 210 సినిమాల్లో నటించడంతోపాటు 47 సంవత్సరాలుగా ఆర్కెష్ట్రా నిర్వహిస్తూ 6వేల కార్యక్రమాలను చేపట్టిన  శ్రీపాద జిత్‌మోహన్‌ మిత్రాకు నవరస నట సమాఖ్య తరపున జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నామని ఆ సంస్థ గౌరవాధ్యక్షులు పట్టపగలు వెంకట్రావు తెలిపారు. వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నటుడిగా, గాయకుడిగా, క్రీడాకారునిగా, న్యాయవాదిగా, సంఘ సేవకుడిగా తన జీవితాన్ని అంకితం చేసిన జిత్‌మోహన్‌ మిత్రాకు ఈనెల 25న సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో మొట్టమొదటిగా ఆర్కెష్ట్రాను 1965లో ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తుండటం సామాన్య విషయం కాదన్నారు. కళారంగానికి ఎన్నో సేవలు చేశారని, ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిత్‌ మోహన్‌ మిత్రా, అశోక్‌కుమార్‌ జైన్‌, జగపతి, పి.వి.ఎస్‌.కృష్ణారావు, ఎ.వి.రమణ, ఆనంద్‌, దుర్గా ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.