విలీన గ్రామాల అభివృద్ధికి సహకరించండి

0
423
అధికారుల, కార్యదర్శుల సమావేశంలో ప్రత్యేకాధికారి విజయరామరాజు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : నగర పాలక సంస్ధలో విలీనం కానున్న గ్రామ పంచాయితీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కమిషనర్‌, విలీన గ్రామాల ప్రత్యేకాధికారి వి. విజయరామరాజు అన్నారు.  ఈరోజు స్ధానిక శ్రీ వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో విలీన గ్రామాల కార్యదర్శులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌  అధికారులతో ఆయన సమావేశమయ్యారు. విలీన గ్రామాల్లో అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని తొలగించాలని, ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో గుర్తింపు పొందిన, పొందని లేఔట్ల వివరాల నివేదికను తనకు సహకరించాలని సూచించారు. ఇకపై నివాసాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించుకునే వారు నిబంధనల మేరకు అనుమతులు పొందాలన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి 14 వ తేదీ వరకు గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు స్వీకరించి 15 వ తేదీనాటికే అనుమతులు ఇస్తామన్నారు. గ్రామాల పరిధిలో  ప్రకటనల పన్నులు వసూలు చేయాలని,  ఎటువంటి   అనుమతులు లేకుండా పోస్టర్లను అతికించరాదన్నారు.  గ్రామాల్లో ఉండే సెల్‌ టవర్ల ఏర్పాటుపై పన్నులు వసూలు చేయాలని, ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని అన్నారు. నగదు రహిత కార్యకలాపాలపై ప్రజలో ్ల అవగాహన పెంచాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పర్చేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో  అదనపు కమిషనర్‌ జి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్‌ ఎం.వి .డి. ఫణిరామ్‌, డివిజనల్‌ పంచాయితీ అధికారి ఎం.వరప్రసాద్‌, రాజానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం రూరల్‌ తహసీల్దార్లు, ఎండిఓలు, పంచాయితీల కార్యదర్శులు, నగర పాలక సంస్ధ మేనేజర్‌ జి. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.