వివేకానందరెడ్డి హత్యపై వైకాపా శ్రేణుల నిరసన ప్రదర్శన

0
211
రాజమహేంద్రవరం, మార్చి 16 :  మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సోదరులు, మాజీ మంత్రి  వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య ఉదంతంతో పెద్దల హస్తం ఉందన్న అనుమానం వ్యక్తమవుతుందని వైకాపా సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతుసూర్యప్రకాశరావు అన్నారు. త్వరలో జరిగే ప్రజాక్షేత్రంలో ప్రజలంతా ప్రభుత్వానికి  తమ ఓటు అనే వజ్రాయుధం ద్వారా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్న విషయం ప్రభుత్వం  గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ప్లకార్డులతో నిరసన ర్యాలీగా వెళ్ళి జాంపేట వద్దగల జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, బాబిరెడ్డి, ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, కురుమిల్లి అనురాధ, గుత్తుల మురళీధరరావు, మజ్జి నూకరత్నం, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, నక్కా శ్రీనగేష్‌, షేక్‌ షబ్నమ్‌ అప్సర్‌, మజ్జి అప్పారావు, పెంకే సురేష్‌, గుదే రఘునరేష్‌, వాకచర్ల కృష్ణ, పతివాడ రమేష్‌, జాన్సన్‌, కుక్కతాతబ్బాయి, తలుపూరి శ్రీనివాస్‌, ఉప్పాడ కోటరెడ్డి, ఫణిశర్మ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here