విస్తరించిన గుడా పరిధి

0
245
అదనంగా 557.3 స్క్వేర్‌ కిలో మీటర్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ
గుడాలోకి  తుని, రామచంద్రాపురం పురపాలక సంఘాలు
కాకినాడ, డిసెంబర్‌ 15 : గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(గుడా) పరిధిని పెంచుతూ ప్రభుత్వం జిఓ జారీ చేసిందని, ప్రస్తుతం 2183 స్క్వేర్‌ కిలోమీటర్ల పరిధి ఉండగా జిఒ 401 ద్వారా 557.3 స్క్వేర్‌ కిలోమీటర్ల పరిధిని పెంచి 2740.3స్క్వేర్‌ కిలోమీటర్లకు గుడా పరిధిని విస్తరించిందని గుడా చైర్మన్‌ గన్నికృష్ణ, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌ తెలిపారు. గుడా డైరెక్టర్‌ గట్టి సత్యనారాయణ, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రాంకుమార్‌లతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం గుడా పరిధిలో 280 గ్రామాలు ఉండగా ఇప్పుడు మరో 74 గ్రామాలను కలిపిందన్నారు. తుని,రామచంద్రాపురం మునిసిపాలిటీలను గుడా పరిధిలోకి తీసుకువచ్చారని తెలిపారు. తొండంగి మండలంలో 8 గ్రామాలు,తుని మండలంలో 9 గ్రామాలు, రామచంద్రాపురం మండలంలో 20 గ్రామాలు, రావులపాలెం మండలంలో 11 గ్రామాలు, తాళ్ళరేవు మండలంలో 11 గ్రామాలు, శంఖవరం మండలంలో రెండు గ్రామాలు, కరప మండలంలో 13 గ్రామాలు కలిసాయని పేర్కొన్నారు. ఈ జిఒను ప్రభుత్వం నిన్న విడుదల చేసిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here