వీర్రాజు…ఇదేమీ

0
318

బలాబలాలు తెలుసుకుని మాట్లాడండి

మమ్మల్ని రెచ్చగొడితే మీ గురించి మాట్లాడవలసి ఉంటుంది

ఎమ్మెల్సీ సోము తీరుపై గుడా చైర్మన్‌ గన్ని తీవ్ర ధ్వజం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5 : సీఎం చంద్రబాబునాయుడుపై బిజెపి జాతీయ కార్యవర్గసభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చీటికి,మాటికీ తెదేపాపై, చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు నిందలు వేసే ముందు సోము తమ బలాబలాల్ని తెలుసుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. తెదేపా సహాయం లేకుండా అసెంబ్లీకి పోటీచేసినా, పార్లమెంట్‌కు పోటీ చేసినా సోముకొచ్చిన ఓట్లు నాలుగంకెలు ఎప్పుడైనా దాటాయా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి గెలిచిన నాలుగు సీట్లు తెలుగుదేశం కార్యకర్తల పుణ్యం కాదా అని ఆయన నిలదీశారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలలో సోము నిర్వాకం గురించి ఓ సారి ప్రెస్‌క్లబ్‌ లో చర్చాకార్యక్రమం పెడదామని, ఆయన నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో సహా బట్టబయలుచేస్తామని గన్ని అన్నారు. ”రాజమండ్రి సిటీ సీటు మీరు డాక్టర్‌ గారికి ధారాదత్తం చేయడం వెనకజరిగిన లావాదేవీల విషయం మాట్లాడడం సభ్యత కాదని మాట్లాడడంలేదు..రాజమండ్రి వాసిగా మీపై మాకున్న గౌరవాన్ని పదేపదే మా పార్టీ మీదా మా నాయకుడి మీద అకారణంగా ద్వేషాన్ని వెళ్ళగ్రక్కడం ద్వారా పోగొట్టుకుంటున్నారు..మిత్రపక్షంగా వుంటూ మా నాయకుడిని దూషించడం వెనుక …జైలుపార్టీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరగడం వెనుకా మీ రహస్య అజెెండా ప్రజలకు తెలుస్తూనే వుంది..మా నాయకుడి కట్టడితో ఇంతకాలం సహించాం..ఇకపై మీకు మాటకు మాట జవాబివ్వడం మాకు నిముషాల మీద పని..తెలుసుకోండి..రాష్ట్ర ప్రగతిని ద ష్టిలో పెట్టుకుని మా నాయకుడు సంయమనంతో వుంటున్నారని మీరు, మీ సహచరులు తెలుసుకోండి…గుజరాత్‌ రాజస్థాన్‌ ప్రజల తీర్పును చూసైనా తెలివి తెచ్చుకోండి…చంద్రబాబు పైన కాదు..రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మీ నాయకుల మీద పోరాటం చేయండి చేతనైతే..!!” అని వీర్రాజుకు గన్ని సలహా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here