వృద్దులను ఆదుకోవడం అందరి బాధ్యత : రౌతు

0
292
రాజమహేంద్రవరం,  జనవరి  5 : సమాజంలోని వృద్ధులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైకాపా సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర సేవాసంస్థలో ఈరోజు రాజమహేంద్రవరం అర్బన్‌జిల్లా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, బీసీ సంఘం నాయకుడు పొడుగు శ్రీను (గాడాల) పుట్టినరోజు వేడుకలను వృద్ధుల సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రౌతు మాట్లాడుతూ వృద్దులకు అన్నదానంచేయడం గొప్ప విషయమన్నారు. జన్మదిన వేడుకకు ఆడంబరాలకు ఖర్చుచేయకుండా పొడుగుశ్రీను తన పుట్టినరోజునాడు వృద్ధులకు అన్నదానంచేసి, మరికొంతమందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. స్వర్ణాంధ్ర సేవలు మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర వ్వవస్ధాపక కార్యదర్శి డాక్టర్‌ గుబ్బల రాంబాబు శ్రీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీను కేక్‌కట్‌ చేసి అందరికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుక్కా తాతాబ్బాయి, చేబోలు శివశంకర్‌, మండా వెంకట్‌, పొగుడు సుబ్బు, లంక ప్రసాద్‌, లంక వెంకటేష్‌, గండేబత్తుల వీర్రాఘవులు, గుదే చలపతి, వాస్తి రాజా, పాలూరి మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.