వైఎంవిఎ ఆధ్వర్యాన 22,23,24 తేదీల్లో ఇంపాక్ట్‌ -2018

0
392

రాజమహేంద్రవరం, జూన్‌ 12 : యువతలో సానుకూల ద క్పధం అలవర్చడం కోసం,లక్ష్యాలను నిర్దేశించుకుని విజయ శిఖరాలను నమోదు చేసుకోవడం కోసం సాఫ్ట్‌ స్కిల్స్‌ పై ప్రముఖ వక్తలతో మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చేలా ఇంపాక్ట్‌ -2018 పేరుతొ రాజమండ్రి యంగ్‌మెన్స్‌ వైశ్యా అసోసియేషన్‌ (వైఎంవిఎ) ఓ బ హత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఈ నెల 22,23,24 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రాజెక్ట్‌ చైర్మన్‌ సత్యవరపు గోకుల మురళీ,వైఎం విఎ అధ్యక్షులు పులవర్తి వెంకటేష్‌,కార్యదర్శి చిట్టూరి సీతారామరాజు,ట్రెజరర్‌ కోడూరి శేషగిరి,మద్దుల రామక ష్ణ,పెంటపాటి సుభాష్‌,మండవిల్లి శివ, తవ్వా రాజా,కారుమూరి చరణ్‌ తేజ్‌,బొండాడ ప్రభాత్‌ తదితరులతో కల్సి ఈ ఉదయం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇప్పటికే పలు విద్య వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎంవిఎ ఇప్పుడు పెద్దఎత్తున ఇంపాక్ట్‌ -2018 నిర్వహించ తలపెట్టిందని చెప్పారు. అర్బన్‌ ఎస్పీ రాజకుమారి చేతుల మీదుగా ఈ కార్యక్రమ పోస్టర్‌ ఆవిష్కరించినట్లు గోకుల మురళీ తెలిపారు. ప్రముఖ వక్త గంపా నాగేశ్వరరావు ప్రధాన పాత్ర పోషిస్తూ శాస్త్రీయంగా డిజైన్‌ చేసిన ఇంపాక్ట్‌ -2018 ప్రోగ్రామ్‌ లో ఉభయ గోదావరి జిల్లాలో విద్యార్థులు,పోటీ పరీక్షలు హాజరయ్యే వారు, యువత తమ పేర్లు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్‌ తెలుగు ఇంపాక్ట్‌ డాన్‌ ఇన్‌ క్లిక్‌ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు. వెయ్యి మంది ఈ శిక్షణకు హాజరవుతారని అంచనాతో ఉన్నామని, అందుకే ముందుగా నమోదు చేసుకున్నవాళ్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మూడు రోజుల శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికెట్‌ అందజేస్తామని తెలిపారు. డాక్టర్‌ యండమూరి వీరేంద్రనాధ్‌, డాక్టర్‌ బివి పట్టాభి రామ్‌,సీబీఐ మాజీ జెడి డాక్టర్‌ లక్ష్మీ నారాయణ,భారతీయం సత్యవాణి,ప్రొఫెసర్‌ విశ్వనాధం, డాక్టర్‌ రత్నాకర్‌,శ్రీధర్‌ బాబు,డాక్టర్‌ చిరంజీవి,డాక్టర్‌ జయసింహ,జగన్‌ గురూజీ, క ష్ణ ప్రదీప్‌, సాయి సతీష్‌, కెవిఎన్‌ కార్తీక్‌, డాక్టర్‌ మల్లికార్జున్‌, అప్పల ప్రసాద్‌లు శిక్షణ ఇస్తారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here