వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి దుర్గేష్‌

0
318
12న లేదా 16న జగన్‌ సమక్షంలో చేరిక
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 2 : కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ శాసనమండలి సభ్యులు కందుల దుర్గేష్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దుర్గేష్‌  ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అభి మానులతో, సన్నిహితులతో చర్చించిన పిమ్మట ఆయన  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12 న లేదా 16న ఆయన హైదరాబాద్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దుర్గేష్‌తో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు.