వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ దురాగతాలను త్రిప్పి కొడదాం

0
220
గన్ని కార్యాలయంలో కోడెలకు ఘన నివాళి
రాజకీయ వేధింపులే కారణమన్న నేతలు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 17 : పార్టీ పట్ల నిబద్దత కలిగిన కోడెల శివప్రసాదరావు మృతి రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజకీయ వేధింపుల వలనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. నవ్యాంధ్ర తొలి సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి పట్ల గన్ని కృష్ణ కార్యాలయంలో సంతాపసభ నిర్వహించారు. ముందుగా కోడెల చిత్రపటానికి గన్ని, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. గోదావరిలో  బోటు మునిగి మరణించిన వారికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు.  కోడెల మృతికి వైకాపా ప్రభుత్వ వైఖరే కారణమంటూ తెదేపా శ్రేణులు నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ పార్టీలో అందరితో అనుబంధం కలిగిన నాయకుడు కోడెల అని, వ్యక్తిగతంగా ఆయనతో సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఆయన మరణవార్త వినగానే కళ్ళలో నీళ్ళు ఆగలేదని, ఇప్పటికీ ఆయన మరణించారంటే నమ్మలేకపోతున్నాని అన్నారు. ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కోడెల పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు శ్రమించారని అన్నారు. హోం మంత్రిగా,ఇరిగేషన్‌ శాఖ,గ్రామీణాభివ ద్ధి శాఖ మంత్రిగా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలబడే ధైర్యశాలి కోడెల అని అన్నారు. అలాంటి వ్యక్తిని మానసికంగా, రాజకీయంగా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందన్నారు. బసవతారకం ఆసుపత్రికి తీసుకెళితే దానిని కూడా బొత్స రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ దురాగతాలను త్రిప్పి కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ సైనికులు సంసిద్దులు కావాలని పిలుపునిచ్చారు. యర్రా వేణు మాట్లాడుతూ కోడెల మరణం తనను కలచివేసిందని, పార్టీకి, గుంటూరు జిల్లాకి,రాష్ట్రానికి ఆయన విశేష సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కురగంటి సతీష్‌,మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, యిన్నమూరి రాంబాబు, తలారి ఉమాదేవి, కోరుమెల్లి విజయశేఖర్‌, కడలి రామకృష్ణ, తంగెళ్ళ బాబి, పాలవలస వీరభద్రం,ద్వారా పార్వతి సుందరి, సింహా నాగమణి, బెజవాడ రాజ్‌కుమార్‌, కప్పల వెలుగుకుమారి, మజ్జి పద్మ, చాన్‌ భాషా, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, ఉప్పులూరి జానకిరామయ్య, నల్లం శ్రీనివాస్‌,శెట్టి జగదీష్‌,పితాని కుటుంబ రావు, కంటిపూడి శ్రీనివాస్‌, బెజవాడ వెంకటస్వామి, వారాది హనుమంతరావు, మజ్జి శ్రీనివాస్‌, నిమ్మలపూడి గోవింద్‌, మళ్ళ వెంకట్రాజు,చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి,కవులూరి వెంకట్రావు, బిక్కిన రవికిషోర్‌, చించినాడ తాతాజీ, నల్లం ఆనంద్‌, జాలా మదన్‌, కర్రి రాంబాబు, విశ్వనాధరాజు, ముత్య సత్తిబాబు,ఎస్‌ఎ కరీం, గరగ మురళీకృష్ణ, కెవి శ్రీనివాస్‌, జి.కొండబాబు, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, శేఖర్‌, సూరంపూడి శ్రీహరి,వానపల్లి సాయిబాబా, ఎంఎ రషీద్‌, వానపల్లి శ్రీనివాస్‌, దమర్‌ సింగ్‌ బ్రహ్మాజీ,కర్రి కాశీవిశ్వనాధం, పాలవలస బ్రహ్మాజీ, ఎవివి సత్యనారాయణ, మెహబూబ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here