వైకాపాకు మహాసేన మద్దతు

0
192
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 8 : ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో వైకాపాకు మహాసేన మద్దతు ఇస్తోందని మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు సిరింగి రత్నకుమార్‌ చెప్పారు. ి ప్రెస్‌క్లబ్‌లో ఈ ఉదయం  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాల,మైనార్టీల హక్కుల పరిరక్షణకు పోరాడుతున్న మహాసేన చెప్పిన అంశాలకు అనుగుణంగా వైకాపా ఎన్నికల ప్రణాళిక ఉన్నందున మద్దతు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో సైతం 50శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పడం ద్వారా నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారని ఆయన అన్నారు. మహాసేన వ్యవస్థాపకులు ఎస్‌ రాజేష్‌,రాజమండ్రి శాఖ అధ్యక్షుడు పొన్నల దినకర్‌,బిసి విభాగం అధ్యక్షుడు గుబ్బల  బలరాం,మెడికల్‌ అడ్వైజర్‌ హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here