వైకాపాలో చేరిన బొదిరెడ్ల ఏడుకొండలు 

0
276
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : అధికార పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజామహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ మార్గాన్ని భరత్‌, రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక 27వ డివిజన్లో బొదిరెడ్ల ఏడుకొండలు ఆధ్వర్యంలో 200 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరికీ మార్గాన్ని భరత్‌, ఆకుల వీర్రాజు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందరికీ అందాలంటే వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పిల్లి నిర్మల, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డి స్వామి, హరిబాబు రెడ్డి, భవానీ శంకర్‌ రెడ్డి, బాల వీర బాబు రెడ్డి, కె అప్పల రెడ్డి, బొప్పి రెడ్డి, కర్రి రామారావు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here