వైకాపాలో పలువురు కార్యకర్తలు చేరిక

0
302
రాజమహేంద్రవరం,  నవంబర్‌ 29 : వైకాపా ఆధ్వర్యంలో  చేపట్టిన గడప గడప వైఎస్సార్‌ కార్యక్రమంలో  15వ వార్డులో రెల్లిపేటలో జరిగింది. వార్డు ఇన్‌చార్జ్‌ ముత్యాల పెదబాబు ఆధ్వర్యంలో సిటీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన వార్డులో గడప గడపకు కరపత్రాలను పంచారు. వైకాపా కి కంచుకోటలా కార్యకర్తలు, వార్డు ప్రజలు నీరాజనాలు పలికారు.  తెదేపా  ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరరేర్చలేదని పేద ప్రజల బ్రతుకులపై నీళ్ళు చల్లరాని చంద్రబాబు పై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు.  ఈ కార్యక్రమంలో దంగేటి వీరబాబు, మేడపాటి షర్మిలారెడ్డి, మారి లక్ష్మి,  వాకచర్ల కృష్ణ, గుదె రఘు, పోలు కిరణ్‌రెడ్డి, బాపన సుధారాణి, సురేష్‌ స్థానికులు సోమి శ్రీను, ఏనుగులు శివ, బాలు, అర్జి సింహాచలం,  పెదిరెడ్ల శ్రీనివాస్‌,  నీలం గణపతి, మస్తాన్‌, మజ్జి అప్పారావు, లంక సత్యనారాయణ, కట్టా సూర్య ప్రకాశరావు, సబ్బరపు సూరిబాబు, సోము తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు కార్యకర్తలు వైకాపాలో చేరారు. రెడ్డి రమణ, పి. ప్రసాద్‌, ముత్యాల దుర్గాభవాని,  ముత్యా లక్ష్మి రాము, శ్రీదేవి, మీసాల స్రవంతి, కనక, అనూష, ముత్యాల రమణ,అప్పారావు తదితరులు రౌతు నేతృత్వంలో పార్టీలో చేరారు.