వైకాపా మాజీ కార్పొరేటర్లకు పార్టీ సత్కారం

0
230
రాజమహేంద్రవరం, జులై 4 :  నగరపాలక మండలిలో 2014-19 వరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కార్పొరేటర్లుగా బాధ్యతలు నిర్వహించిన వారిని ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. స్థానిక జాంపేటలో ఉన్న పార్టీ కార్యాలయంలో సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, సిసిసి ఎండి పంతం కొండలరావులు మాజీ కార్పొరేటర్లను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి డివిజన్లలోని సమస్యలను పరిష్కరించి కౌన్సిల్‌లో నగర అభివృద్ధిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముద్ర వేయించి సమస్యలపై పోరాడారని ప్రశంసించారు.  ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పెంకే సుధారాణి, మజ్జి నూకరత్నం, కురుమెల్లి అనూరాధ, నండూరి రమణ, పిల్లి నిర్మలలను అభినందించారు. అన్ని విధాలా సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీనియర్‌ మైనార్టీ నాయకులు మహ్మద్‌ సిద్ధిఖ్‌  మరణానికి పార్టీ శ్రేణులు ఒక నిమిషం పాటించారు. ఈ కార్యక్రమంలో చాంబర్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ జైన్‌, మహిళాధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నక్కా శ్రీనగేష్‌, ప్రసాదుల హరినాధ్‌, సంకిస భవానీప్రియ, గుడాల ప్రసాద్‌, గుడాల ఆదిలక్ష్మి, నీలపాల తమ్మారావు, వలవల చిన్ని, పొడుగు శ్రీను, మాసా రామజోగ్‌, కాటం రజనీకాంత్‌, ఎండి ఆరిఫ్‌, సయ్యద్‌ రబ్బానీ, గౌస్‌, సయ్యద్‌ హసన్‌, హసీనా, సుంకర శ్రీను, గుడాల జాన్సన్‌, నరవ గోపాలకృష్ణ, డివి రాఘవరావు, నిరీక్షణ జేమ్స్‌, కస్సే రాజేష్‌, నీలం గణపతి, ఉప్పాల కోటరెడ్డి, మేడబోయిన సునీల్‌, అందనాపల్లి సత్యనారాయణ, మోతా సుభాష్‌, మచ్చా కుమారి, అడపా అనిల్‌, నందం కుమార్‌ రాజా, గుదే రఘు, సోమి శ్రీను, ముప్పన ప్రభాకర్‌, తిరగటి దుర్గా, రాజు, బురిడి త్రిమూర్తులు, తామాడ సుశీల, కొంటాడ ఈశ్వర్‌, పెద్ద వెంకటేశ్వర్లు, అడపా రాజు, సప్పా ఆదినారాయణ, కురుమెల్లి స్వరూప్‌, గొలుగూరి సూర్రెడ్డి, కొయ్యాన పెద్దిరాజు, రొక్కం త్రినాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here