వైజ్ఞానిక ప్రదర్శనలతో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి

0
152
ఇన్స్పైర్‌ -2019 ప్రారంభంలో ఎమ్మెల్యే భవాని
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4 : విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచేందుకు ఇన్స్పైర్‌ ప్రదర్శనలు ప్రోత్సహాన్నిస్తాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. స్థానిక బివిఎమ్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో  ఇన్స్పైర్‌-మనక్‌ 2020 వైజ్ఞానిక ప్రదర్శన  ప్రారంభ సభలో ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్థులు అందరూ శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేసుకోవాలన్నారు. తొలుత భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో అత్యధిక ప్రదర్శనలు మన జిల్లా నుండి 479 మంది ఎంపికయ్యాయన్నారు.  బి.వి.ఎమ్‌లో 347 ప్రదర్శనలు ఈ మూడు రోజులూ ప్రదర్శిస్తారన్నారు. పి.గన్నవరం శాసన సభ్యులు కె.చిట్టిబాబు,ఉభయగోదావరి జిల్లాల శాసన మండలి సభ్యులు ఐ.వెంకటేశ్వర రావు, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ వసంత్‌ కుమార్‌,  సైన్స్‌ ఫెయిర్‌ కేంద్ర పరిశీలకులు అమోల్‌ జాదవ్‌, సైన్స్‌ మెంటర్‌ ఎస్‌.జి.శ్రీనివాస్‌,బివిఎమ్‌ పాఠశాల ల కరెస్పాండెంట్‌  మురళి కృష్ణ, అర్బన్‌ రేంజ్‌ డి ఐ.బి.దిలీప్‌ కుమార్‌, నగర పాలక సంస్థ విద్యాశాఖాధికారి పులుగుర్త దుర్గాప్రసాద్‌, మండల విద్యా శాఖాధికారులు స్వామినాయక్‌,కుశలవ దొర, లజపతి రాయ్‌,  జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పి.విష్ణుమూర్తి, కోలా సత్యనారాయణ ,బి.వి.ఎమ్‌ ప్రధానోపాధ్యాయులు వెంకటరాజు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here