వైఫల్యాలను ఎత్తి చూపకుండా గొంతు నొక్కడమే 

0
134
జిఓ 2430 తక్షణం ఉపసంహరించాలని గన్ని డిమాండ్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 31 : భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేలా రాష్ట్రప్రభుత్వం  జీవో నెం:2430 జారీ చేయడం ప్రజాస్వామ్యస్ఫూర్తికే మాయనిమచ్చని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర  సీనియర్‌ నాయకులు, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  పత్రికలైనా, పత్రికల ద్వారా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు గానీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక చర్యలను, అవినీతిని ఎత్తిచూపి పోరాడటం ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాసి ప్రశ్నించేవారి గొంతునొక్కబూనడం అవినీతిరహిత పారదర్శక పాలననందిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాలకు తగని పని అని గన్ని అన్నారు. అప్రజాస్వామిక, అరాచక విధానాలతో పాలన కొనసాగిస్తున్న వైకాపా ప్రభుత్వం తన పాలనా వైఫల్యాలను, తప్పిదాలను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ జిఓను జారీ చేసిందని, తక్షణం జీవోనెం 2430ను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యవిలువలను కాపాడవలసిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here