వైభవంగా దేవతా విగ్రహాల ప్రతిష్ట

0
724
రాజమహేంద్రవరం, జులై 2 : బాలాత్రిపురసుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయ పునః ప్రతిష్టా కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. తపోవనం పీఠాధిపతి సచ్చిదానందసరస్వతి స్వామిజీ చేతుల మీదుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న పలు ఉపాలయాల్లో దేవతావిగ్రహాల ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవిభూదేవి సమేత బిందుమాధవస్వామి ధ్వజస్థంభం, చండీశ్వర, నందిశ్వర, ద్వారపాలక రాజగోపుర శిఖర పునఃప్రతిష్ట కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సి దంపతుల ఆధ్వర్యంలో ధ్వజస్థంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా సిద్దిగణపతి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహాలు, కాలభైరవస్వామి, సూర్యనారాయణమూర్తి, రమాసహిత సత్యనారాయణస్వామి, దాస ఆంజనేయస్వామి, సంతోషిమాత, లక్ష్మిదేవి, తదితర విగ్రహాలను ప్రతిష్ఠించారు. పూజా కార్యక్రమం అనంతరం సచ్చిదానంద సరస్వతి స్వామీజి అనుగ్రహ బాషణం చేశారు. ఆగమ పండితులు దేవులపల్లి కృష్ణమూర్తి శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి చంద్రమౌళి, ఖండవిల్లి వీరవెంకట సత్యనారాయణ ఆచార్యులు , పెద్దింటి నీలకరఠసుబ్రహ్మణ్యసీతారామకుమార్‌శర్మ ఆధ్వర్యంలో స్మార్తఆగమ పండితులు కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఎంపీ మాగంటి మురళీమోహన్‌, గూడా చైర్మన్‌ గన్నికృష్ణ, మేయర్‌ పంతం రజనీశేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాస్‌, 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, జ్ఞానసరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, విశ్వేశ్వరస్వామి దేవాలయం మాజీ చైర్మన్‌ నిమ్మలపూడి గోవింద్‌ , ప్రింటోనిక అధినేత గోకుల మురళి తదితరులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌ మండవల్లి శివ, కార్యనిర్వహణాధికారి ఎం. శోభారాణి, సభ్యులు పాలకోడేటి పద్మజ, రాయిఅప్పన్నబాబు, కోలా అప్పారావు, రాపర్తి శ్రీనివాస్‌, కొల్లి నాగేశ్వరరావు, మందపల్లి రమణ అతిధులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, జ్ఞాపికలతో సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here