వైశ్యుల వసుదైకతకు వేదిక కార్తీక వన సమారాధన

0
390
జాతికి అండదండగా నిలిచిన శివరామసుబ్రహ్మణ్యం సారధ్యంలో ఏర్పాట్లు
రేపు మంత్రి శిద్ధా రాఘవరావుకు సత్కారం –  మాజీ గవర్నర్‌ రోశయ్య రాక
రాజమహేంద్రవరం, నవంబర్‌ 5 : వైశ్య జాతి సమిష్టి భావానికి, వసుధైకతకు రేపు రాజమహేంద్రవరం వేదిక కానుంది. రాజకీయ, వ్యాపార రంగంలో తమ ప్రత్యేకత చాటుతూ అన్ని వర్గాల వారి ఆదరాభిమానాలను చూరగొంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఆదర్శంగా నిలిచిన రాజమహేంద్రవర వైశ్యులు మరో మారు  తమ సంఘటిత శక్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. గోదావరి తీరాన ఇతర కులాలు సంఘటితమై ఏటా కార్తీక వన సమారాధన నిర్వహణకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వైశ్యులు నగరంలో  రేపు భారీ ఎత్తున కార్తీక వనసమారాధన నిర్వహణకు సమాయత్తమవుతున్నారు.నగరంలోని ప్రధాన వైశ్య సేవా సంస్ధలతో పాటు అనుబంధంగా ఉన్న పలు సంఘాలను సమైక్య పర్చి భారీ స్థాయిలో  2009లో కార్తీక వన మ¬త్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏపీఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం వార్తల్లో నిలిచారు.  పిన్న వయస్సులోనే పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ వైశ్య జాతికి అభిమానపాత్రుడైన శివరామసుబ్రహ్మణ్యానికి సంఘీయులు బాసటగా నిలిచారు. శివరామసుబ్రహ్మణ్యం ఏపీఐఐసి చైర్మన్‌గా ఉన్న  కాలంలో నగరంలోని కొత్తతరం వైశ్య ప్రతినిధులు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిల్డర్‌గా ఓ వైపు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వైశ్య జాతిని ఏకత్రాటిపైకి తెచ్చి వైశ్య జాతి ఆశాజ్యోతిగా ఉన్న శివరామసుబ్రహ్మణ్యం వైశ్యుల ఐక్యతను మరో మారు చాటేందుకు రేపు భారీ ఎత్తున కార్తీక వన సమారాధన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో వైశ్యుల ప్రతినిధిగా ఉన్న రవాణా, ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు  శివరాముని సారధ్యంలో ఆత్మీయ సత్కారం చేయనున్నారు. శివరామసుబ్రహ్యణ్యం గురుతుల్యులుగా భావించే తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ఈ కార్యక్రమానికి గౌరవ విశిష్ట అతిధిగా పాల్గొనబోతున్నారు. జవహర్‌లాల్‌నెహ్రూ రోడ్డు చివరన జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బెస్ట్‌ ప్రైస్‌ వద్ద ఉన్న చెరుకూరి వీర్రాజు తోటలో వైశ్య హాస్టల్‌, వైఎంవిఏ, రాజమండ్రి  ఆర్య వైశ్య సేవా సంస్ధలతో మంత్రి రాఘవరావును సత్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు పార్టీల ప్రముఖులు పాల్గొంటారు.