శక్తివంతమైన భారత్‌ నిర్మాణమే లక్ష్యం

0
137
పార్లమెంట్‌ ఉభయ సభల ప్రసంగంలో రాష్ట్రపతి
న్యూఢిల్లీ, జూన్‌ 20 : ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది….”అందరితో కలిసి.. అందరికీ వికాసం.. అందరి విశ్వాసం (సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌)’ అనే నినాదం సాకారం కోసం తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది….2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతుంది. నవ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది…శక్తివంతమైన భారత్‌ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. 2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భారత అంతరిక్ష సామర్థ్యం, దేశ భద్రతా సన్నద్ధతలో ‘మిషన్‌ శక్తి’ సరికొత్త అధ్యాయమని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా ఉన్నాయని, మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడమే దీనికి రుజువు అని అన్నారు. దేశ భద్రతే తమ  ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ఉగ్ర శిబిరాలపై సర్జికల్‌ దాడులు, వైమానిక దాడులు ఉగ్రవాదం పట్ల భారత్‌ తీరును స్పష్టం చేస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. తరచూ ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరగడం దేశ అభివ ద్ధిపై ప్రభావం చూపిస్తోందని,  దేశం వేగంగా అభివ ద్ది చెందేందుకు ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పద్ధతిని అమలు చేయాల్సిన సమయం వచ్చిందిఈరోజు పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని అభినందించారు. ‘ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయం. ఈ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు స ష్టించారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంది. భారత్‌ను అభివ ద్ధి పథాన కొనసాగించేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశమిచ్చారు. 17వ లోక్‌సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారే. అంతేగాక, మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. నవ భారత నిర్మాణానికి ఇదే నిదర్శనం’ అని కోవింద్‌ అన్నారు. ప్రభుత్వ అజెండాలోని కీలక అంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. బహిరంగ, అంతర్గత ముప్పుల నుంచి దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం క షి చేస్తుందని, అన్నారు. లి రైతుల, జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తాము. నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, జల్‌ శక్తి మంత్రిత్వ శాఖే ఇందుకు నిదర్శనమని,  ప్రజలందరి జీవన స్థితిగతులు మారుస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్థిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, యువతకు మంచి విద్యావకాశాల కల్పనకు మరిన్ని కోర్సులు తీసుకొస్తాం. యువ భారత్‌ స్వప్నాలు సాకారం చేస్తామని, నివాస, వైద్య సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని,  సాధికారతతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని రాష్ట్రపతి అన్నారు. రైతులు, చిన్న వ్యాపారుల భద్రత కోసం ప్రభుత్వం పింఛను పథకం తీసుకొచ్చిందని,గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని,  క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించేందుకు కొత్త విధానాలను తీసుకొస్తామని, క్రీడాకారులకు ఆధునిక శిక్షణ అందిస్తామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి చెబుతూ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఇప్పటి వరకు ఈ నిధి కింద మూడు నెలల్లో రూ. 12వేల కోట్లు ఇచ్చామని,  40ఏళ్లు దాటిన రైతులకు పింఛను ఇస్తామని, మత్స్య సంపద అభివ ద్ధికి ప్రభుత్వం క షి చేస్తుందని రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. మహిళలకు సమానహక్కులు కల్పించాలంటే ముమ్మారు తలాక్‌, నిఖా హలాలా వంటి పద్ధతులను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని,  జీఎస్‌టీని మరింత సరళీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామనతీ,  ప్రజారవాణాను మెరుగు పరచడంపై ప్రభుత్వం ద ష్టిపెట్టింది. ‘ఒకే దేశం ఒకే రవాణా కార్డు’ సదుపాయం ఏర్పాటుపై పరిశీలనలు చేస్తున్నామన్నారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివ ద్ధి కార్యక్రమాలు చేపడుతామని,  అక్రమ వలసదారులతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున సరిహద్దుల్లో భధ్రతను పెంచుతామని,  జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ ప్రక్రియను కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here