శరన్నవరాత్రులు శుభారంభం

0
343
దేవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
రాజమహేంద్రవరం, అక్టోబరు 10 : శరన్నవరాత్ర మహోత్సవాలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అశ్వీయుజ మాసంలో ఏటా శుక్ల పక్షంలో పాడ్యమి తిధి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమై విజయదశమి వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా నగరంలో అనేక ప్రాంతాల్లో దేవీ అమ్మవారిని ప్రతిష్టించి దసరా పూజలు ఆరంభించారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని  రోజుకో అవతారంలో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. స్ధానిక దేవీచౌక్‌లో గత రాత్రి దేవీ అమ్మవారిని ప్రతిష్టించి నేటి నుంచి నవరాత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా దేవీచౌక్‌ పరిసరాలను విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించడంతో ఈ రాత్రి నుంచి  ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోనుంది. అలాగే నగరంలోని జెఎన్‌ రోడ్డులో, కోటిపల్లి బస్టాండ్‌, గోదావరి గట్టు, ఆర్యాపురం, జాంపేట , కోరుకొండ రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా దేవీ నవరాత్రులను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. అలాగే దేవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. భక్తి శ్రద్ధలతో సర్వాంగ శోభితంగా కొలువు తీరిన అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here