శాటిలైట్‌సిటీలో ఉచిత వైద్య శిబిరం

0
147
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  28 :  హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఎయిడ్స్‌ ఎవేర్‌నెస్‌ ఇలిటరరీ సొసైటీ (హీల్స్‌) ఆధ్వర్యంలో శాటిలైట్‌ సిటీలోని విజయలక్ష్మీ క్లీనిక్‌లో ఉచిత రక్తపోటు, మధుమేహ వ్యాధుల చికిత్స శిబిరం జరిగింది. హీల్స్‌ అధ్యక్షులు వి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో  జరిగిన ఈ శిబిరంలో హీల్స్‌ ప్రధాన కార్యదర్శి ఆకాశం గౌరీష్‌బాబు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ శిబిరంలో జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, జనరల్‌ హాస్పటల్‌ వైద్య నిపుణులు కె.చిన్నంరాజు రోగులను పరీక్షించి మందులు సిఫార్సు చేయగా జూనియర్‌ డాక్టర్‌ శ్రీరామ్‌కుమార్‌ వేములవాడ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హీల్స్‌ కార్యవర్గసభ్యులు వైఎస్‌ఎన్‌ మూర్తి, ఎం.శ్రీనివాస్‌,  మెడికల్‌ రిప్రజెంటిటివ్‌ కడవల శ్రీనివాస్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల పారా మెడికల్‌ సిబ్బంది కార్తీక్‌, లిడియా, పిఆర్‌ఓ గోవిందరాజులు సహాయకులుగా వ్యవహరించారు. దాదాపు 200 మందికి ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 15 మందికి ఇసీజి పరీక్షలు నిర్వహించారు.