శాటిలైట్‌సిటీలో ఉచిత వైద్య సేవా శిబిరం

0
258
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 26 :  హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఎయిడ్స్‌ ఎవేర్‌నెస్‌ అండ్‌ లిటరరీ సొసైటీ (హీల్స్‌) ఆధ్వర్యంలో శాటిలైట్‌సిటీలోని విజయలక్ష్మీ క్లీనిక్‌లో ఉచిత రక్తపోటు, మధుమేహ వ్యాధుల చికిత్స శిబిరం నిన్న నిర్వహించారు. హీల్స్‌ అధ్యక్షులు  డా.వి.వి. కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరాన్ని హీల్స్‌ ప్రధాన కార్యదర్శి ఆకాశం గౌరీష్‌బాబు పర్యవేక్షించారు. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల వైద్య నిపుణులు డా. ఏ.దీప్తి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సిఫార్సు చేయగా హీల్స్‌ అధ్యక్షులు వి.వి.కృష్ణారావు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గసభ్యులు వైఎస్‌ఎన్‌ మూర్తి, ఎం.శ్రీనివాస్‌,  మెడికల్‌ కంపెనీ రిప్రజెంటిటివ్‌  కె. శ్రీనివాస్‌, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల పారా మెడికల్‌ సిబ్బంది రమేష్‌, గోవిందరాజులు, దుర్గ సహాయకులుగా వ్యవహరించారు.  ఈ శిబిరంలో 250 మందికి ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 15 మందికి ఉచితంగా ఇసీజి పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల మూడవ ఆదివారం ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, అవసరమైన వారు వినియోగించుకోవాలని గౌరీష్‌బాబు కోరారు.