శాప్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన యర్రా

0
383
రాజమహేంద్రవరం, మే 9 : ఆంధ్రప్రదేశ్‌ క్రీడా సాధికార సంస్థ డైరెక్టర్‌గా యర్రా వేణుగోపాలరాయుడు ఈరోజు అమరావతిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు చైర్మన్‌గా కృష్ణాజిల్లాకు చెందిన అంకమ్మ చౌదరి కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖామంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిధిగా పాల్గొని వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి దేవినేని ఉమ, విజయవాడ ఎం.పి. కేశినేని నాని, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌ గద్దే అనూరాధ తదితరులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణస్థాయి నుండి క్రీడా సౌకర్యాలు మెరుగుపరిచి సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీధర్‌వర్మ, గిరిధర్‌రెడ్డి, రవీంద్రనాధ్‌, రజనీ, ఎం.లక్ష్మీ హాజరయ్యారు.  నగరానికి చెందిన మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు, కురగంటి సతీష్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, మజ్జి రాంబాబు, కోరుమిల్లి విజయశేఖర్‌, కుడుపూడి సత్తిబాబు, రవి యాదవ్‌, రొబ్బి విజయశేఖర్‌, బుడ్డిగ రాధ, పిన్నింటి రవిశంకర్‌, అల్లాటి రాజు, హరి, బెనర్జీ, గునపర్తి శివ, రావాడ మనోహర్‌,  పోతుల నాగ శ్రీనివాస్‌, చోడిశెట్టి వెంకన్న, అల్లాటి రాజు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here