శాసనసభలో తెదేపా పక్ష ఉప నేతగా గోరంట్ల

0
238
అమరావతి, జూన్‌ 12 : శాసనసభలో తెదేపా ఉప నేతల పేర్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. శాసనసభా పక్షం నేతగా చంద్రబాబు వ్యవహరించనుండగా సీనియర్‌ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కె.అచ్చెన్నాయుడు, ఎన్‌. రామానాయుడులకు పార్టీ ఉపనేతలుగా బాధ్యతలు అప్పగించారు. శాసనసభలో తెదేపా విప్‌గా వీరంజనేయస్వామి వ్యవహరించనున్నారు. శాసనమండలిలో తెదేపా పక్ష నేతగా యనమల రామక ష్ణుడు, ఉపనేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌, సంధ్యారాణి, శ్రీనివాసులు, విప్‌గా బుద్దా వెంకన్న బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
వైకాపా దాడుల్ని ప్రజల్లో ఎండగడుదాం
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైకాపా దాడులను ప్రజల్లో ఎండగట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనమండలి సభ్యులతో  ఆయన సమావేశమయ్యారు. శాసనసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా మండలిలో తెదేపాకే బలముందని.. ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు సూచించారు. తెదేపా నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తారని, అన్నీ ఎదుర్కోవాలన్నారు. తొలుత 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ తెదేపా కార్యకర్తలను భయపెట్టడం, దాడులకు పాల్పడటం వంటివి చేస్తుంటే అన్నాళ్ళు మౌనంగా ఉండలేమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీపై, నాయకులపై అవినీతి బురద చల్లితే వెంటనే తిప్పికొట్టాలన్నారు. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని నేతలకు ఆయన సూచించారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలను విశ్లేషించాలని, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here