శిక్ష కనువిప్పు కలిగించాలి

0
92
‘దిశ’ సంఘటనపై బిసి మహిళల కాగడాల ప్రదర్శన
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 4: దిశ సంఘటనలో నిందితులకు వేసే శిక్ష కనువిప్పు కలిగించాలని బిసి సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మజ్జి సత్యవేణి అన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్ధులతో కలిసి కాగడాల ర్యాలీ ప్రదర్శించారు. బిసి సంక్షేమ సంఘం విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేష్‌, మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు బర్ల సీతారత్నం హాజరయ్యారు. ముందుగా గాంధీ విగ్రహం వద్ద కాగడాలు, కొవ్వొత్తులు వెలిగించి నినాదాలు చేశారు. దిశ సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని గళమెత్తారు.అక్కడ నుండి ఆజాద్‌ చౌక్‌,దేవిచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మజ్జి సత్యవేణి,బర్ల సీతారత్నం మాట్లాడుతూ దిశ సంఘటన చాలా బాధకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడే వేసే శిక్ష నేరగాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెట్టించాలని అన్నారు. జరిగిన సంఘటనతో యావత్తు మహిళా లోకం భయాందోళన చెందుతుందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే ఆత్మ స్థైర్యం కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి కొంచాడ అరుణకుమారి,బొమ్మన గౌరి, ఉప్పు పుష్ప, మీసాల నాగమణి, శారద, మల్లిక, కుసుమ,పుష్ప,నజీమ్‌, బూర హనుమంతరావు,కర్రి రాంబాబు, అవ్వారి శంకర్‌,ఎండి ఉస్మాన్‌,రొక్కం చంటి, చెన్నూరి విష్ణు,ఖండవిల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here