శివరాముడికి బాణా సంచా వర్తకుల అభినందనలు

0
72
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 13 : రాజమహేంద్రవరం సిటీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యానికి దేవీచౌక్‌ శ్రీ బాల త్రిపుర సుందరి బాణా సంచా వర్తక సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. స్థానిక జమిందార్‌మెట్టపై ఉన్న శివరామ సుబ్రహ్మణ్యం కార్యాలయానికి వెళ్లి వర్తక సంఘం ప్రతినిధులు తమ సమస్యలను విన్నవించారు. దీపావళి సందర్భంగా కంబాలచెరువు జంక్షన్‌లో బాణా సంచా విక్రయాలు చేసుకునేందుకు తమకు అవకాశం కల్పించేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన ఆయన ప్రభుత్వ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. శివరాముడిని కలిసిన వారిలో అధ్యక్షుడు కుడుపూడి వెంకట చలపతిరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ పి.వేణు, సెక్రటరీ గంధం శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బత్తుల రాజేశ్వరరావు, అంకం మల్లేశ్వరరావు, ఉప్పు మల్లిఖార్జునరావు, సభ్యులు గంధం సత్యనారాయణ, చక్కా శ్రీనివాసరావు, కొత్త ప్రసాద్‌, రాజాన చంద్రశేఖర్‌, సత్యమూర్తి, కాకినాడ రుద్ర, శీలం వినయ్‌కుమార్‌, కాశి లక్ష్మణరావు, బి.రాజేష్‌ పోసియ్య తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here