శివాలయాలకు కార్తీక శోభ- కిటకిటలాడిన స్నానఘట్టాలు

0
245
రాజమహేంద్రవరం,నవంబర్‌ 19 : కార్తీక మాసంలో పవిత్రమైన రెండో సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున బారులు తీరి ఆలయాల్లో శివుడ్ని దర్శించుకున్నారు. నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి గోదావరి స్నానఘట్టాల్లో పుణ్యస్నాణాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. జాంపేట ఉమా రామలింగేశ్వర, కోటిలింగాల ఘాట్‌ ఉమా కోటిలింగేశ్వర, ఉమా మార్కండేయ స్వామి ఆలయాల్లో భక్తులతో నిండిపోయాయి. భక్తులు పంచామృతాభిషేకాలతో శివుడికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు ఏర్పాట్లు చేసారు. కార్తీక సోమవారంతో పాటు ఏకాదశి, ద్వాదశి కలిసి రావడంతో ఆలయాల్లో పండుగ సందడి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here