శివ పట్నాయక్‌ మృతికి ప్రెస్‌క్లబ్‌ సంతాపం

0
352
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : సీనియర్‌ పాత్రికేయుడు శివ పట్నాయక్‌ మృతికి ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ సంతాపం తెలిపింది. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు సీనియర్‌ పాత్రికేయులు కుడుపూడి పార్ధసారధి ఆధ్వర్యంలో పట్నాయక్‌ మృతి పట్ల సంతాప సభ నిర్వహించారు. ముందుగా పట్నాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం పలువురు పాత్రికేయులు మాట్లాడారు. చిన్న వయసులోనే పట్నాయక్‌ మృతి చెందడం విచారకరమని, వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండెల శ్రీరామమూర్తి, జి.ఏ.భూషణ్‌బాబు, డి.ఏ.లింకన్‌, నమ్మి శ్రీనివాస్‌ (ఎన్‌.ఎస్‌.), కె.శ్రీనివాసరావు, నాని, రెహమాన్‌, దేవులపల్లి రామలింగం, ఓలేటి దివాకర్‌, గరగ ప్రసాద్‌, సోమరాజు, ఎస్‌.బి.రాజేశ్వరరావు (బాబి), గోపాలకృష్ణ, పాలపర్తి శ్రీనివాస్‌, ప్రభాకర్‌, తలుపులరావు, హరి గణేష్‌, ఆకుల  ఈశ్వరరావు, సూరంపూడి వెంకట్రావు, వేగి గణేష్‌, దివాకర్ల ఆనంద్‌, కె.ప్రసాద్‌, దుర్గ, యేల్చూరి నాగభూషణం, వరదా నాగేశ్వరరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, గోపి, మోహన్‌, థియోఫిలాస్‌, మీరాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.