శెట్టిబలిజ, గౌడ ఉపకులాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలిక శ్రీనివాస్‌

0
309
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21 : ఆంధ్రప్రదేశ్‌  శెట్టిబలిజ,గౌడ,ఈడిగ,గౌడ్‌,గాండ్ల, శ్రీశయన కల్లాలే,గౌడియ,యాత ఉప కులాల సహకార  ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గా తూర్పు గోదావరి జిల్లా గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాలిక శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నూతనంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నగరంలో నిర్వహించిన జయహో బీసీ సభలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గీత కార్మికుల ఫెడరేషన్‌ స్థానంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి జి.ఓ విడుదలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జాప్యం జరిగింది. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంలు  పట్టుబట్టి ఈ అవాంతరాలన్నింటినీ  అధిగమించి కార్పొరేషన్‌ ఏర్పాటుకు  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పలుమార్లు సంప్రదింపులు జరిపి జి.ఓ జారీ చేయించారు. కాగా కల్లుగీత కార్మిక ఫెడరేషన్‌ చైర్మన్‌గా తాతా జయప్రకాష్‌ గౌడ్‌ ఆ పదవిలో యధావిధిగా కొనసాగుతారు. ఒకటి రెండు రోజుల్లో కొత్త ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు డైరెక్టర్ల నియామకం పూర్తవుతుంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలో శెట్టిబలిజ, గౌడ, సోదర కులాలకు చెందిన పేదలు ఈ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధి పొందనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here