శ్యామలాంబను దర్శించుకున్న ఎమ్మెల్యే గోరంట్ల

0
279

రాజమహేంద్రవరం, మార్చి 12 : భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం, రాజమహేంద్రవర ప్రధాయిని, గ్రామదేవత అయిన శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ (సోమాలమ్మ) అమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారిని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ మాజీ చైర్మన్‌ రెడ్డిరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి జి.ఎస్‌.రమేష్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గొర్రెల రమణ, రెడ్డిమణి, వల్లు గోవిందు, నరాల రమణమూర్తి, కేతా నాగేశ్వరరావు, కాకి చిన్ని బాబి, ఎం. వీరభద్రరావు, చింతపల్లి మోహన్‌, కందుల వాసు, వాసంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here