శ్రీకన్య గ్రాండ్‌ రాజుకు ఉత్తమ శానిటేషన్‌ అవార్డు  

0
306
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని సక్రమంగా పాటించినందుకు నగరంలోని శ్రీ కన్య గ్రాండ్‌ ¬టల్‌ అధినేత వేగేశ్న సూర్యనారాయణరాజుకు ఉత్తమ శానిటేషన్‌  అవార్డు లభించింది. మేయర్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన శానిటేషన్‌ కమిటీ సమావేశంలో  ఆయనకు  ఈ అవార్డు అందజేశారు. నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, శానిటేషన్‌ కమిటీ చైర్మన్‌ తంగెళ్ళ బాబి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అంతకు ముందు శానిటేషన్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబుతో పాటు కమిటీ సభ్యులు తంగేటి వెంకటలక్ష్మీ,మింది నాగేంద్ర, రెడ్డి పార్వతి, మజ్జి పద్మావతి, హెల్త్‌ ఆఫీసర్లు ఓగిరాల వెంకట ఇందిర, గుత్తుల సత్యదేవ్‌, శానిటరీ సూపర్వైజర్‌ జి.నారాయణరావు, ఇంద్రగంటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.