శ్రీమృఖండేశ్వరాలయంలో మహా శివరాత్రి 

0
138
రాజమహేంద్రవరం, మార్చి 4 : స్థానిక గోదావరి గట్టువద్దగల రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియంలోని 10వ శతాబ్ధం నాటి శ్రీమృఖండేశ్వ లింగానికి గత 30 సంవత్సరాలుగా వై.ఎస్‌.నరసింహారావు, గత పది సంవత్సరాలుగా నగర బ్రాహ్మాణ సేవా సంఘం అధ్యక్షులు పుట్రేవు సూర్యవెంకటరావు అభిషేకాదులు నిర్వహిస్తున్నారు.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా  10వ శతాబ్దానికి చెందిన వినాయకునికి విఘ్నేశ్వరపూజ అనంతరం మృఖండేశ్వ లింగానికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవోపేతంగా భక్తిశ్రద్దలతో నిర్వహించారు. కార్యక్రమంలో వై.ఎస్‌.నరసింహారావు, పుట్రేవు ఉపేంద్రకుమార్‌, రుత్తల తరుణబాబు, సంఘ కార్యదర్శి భాగవతుల వెంకట రమణమూర్తి, సంఘ ఉపాధ్యక్షులు భాగవతి శివరామకృష్ణ, సంఘ కోశాధికారి ప్రయాగ సుబ్రహ్మణ్యం, చల్లా వెంకట సూర్యనారాయణ, చింతా రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భాగవతి శివరామకృష్ణ ప్రసాద వితరణ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here