శ్రీరంగనాయకులకు కన్నీటి వీడ్కోలు

0
161
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 7 : సీనియర్‌ టిడిపి నాయకులు, మాజీ కార్పొరేటర్‌ జక్కంపూడి శ్రీరంగనాయకులకు టిడిపి నాయకులు, అభిమానులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. శ్రీరంగనాయకులు అంతిమ యాత్ర స్ధానిక నెహ్రూనగర్‌లోని వారి స్వగృహం వద్ద నుండి శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యింది. 3వ డివిజన్‌లోని నెహ్రూనగర్‌, రాజేంద్రనగర్‌, గాంధీపురం, సుబ్బారావు పేటలోని పలు వీధుల గుండా అంతిమయాత్ర సాగింది. స్థానిక కోటిలింగాల ఘాట్‌లో అంత్యక్రియలు జరిగాయి. పెద్దకుమారుడు జక్కంపూడి అర్జున్‌ అంతిమ సంస్కరణలు పూర్తిచేశారు. శ్రీరంగనాయకులు అంతిమయాత్రలో మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ కార్పొరేషన్‌ మాజీ అధ్యక్షులు పాలిక శ్రీనివాస్‌, దమరసింగ్‌ బ్రహ్మాజీ, వైౖసిపి నాయకులు నక్కా శ్రీనగేష్‌, మాజీ కార్పొరేటర్‌ బొంత శ్రీహరి, డాక్టర్‌ బళ్ళా శ్రీనివాస్‌, గిరడా రవి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌, బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంతం కృష్ణ, సీనియర్‌ పాత్రికేయుడు కుడిపూడి సారధి, పెద్దఎత్తున స్థానికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here