శ్రీరామ్‌నగర్‌లో రేపు 4వ వైద్య శిబిరం

0
230
జమహేంద్రవరం, జనవరి 22 :  జికె స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ సంయుక్త నిర్వాహణలో ప్రారంభించిన ఉచిత కంటి, పంటి, గుండె, ఇఎన్‌.టి. వ్యాధుల సంచార వైద్యశాలతోపాటు పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ తన ఎంపి నిధుల ద్వారా రూపొందించిన క్యాన్సర్‌ సంచార వైద్యశాల ద్వారా రేపు  ఉదయం 8:30 గంటలకు నాలుగవ వైద్య శిబిరాన్ని శ్రీరామనగర్‌లోని బివిఎం స్కూల్‌ సమీపంలో నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ తెలిపారు. 37, 42, 43, 44 డివిజన్ల ప్రజల నిమిత్తం ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, సంబంధిత డివిజన్‌ ప్రజలు ఈ సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here