షర్మిళారెడ్డి ఇంట మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

0
269
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 13 : తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం స్థానిక దానవాయిపేటలో ఉన్న వైకాపా మాజీ ఫ్లోర్‌లీడర్‌, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షర్మిళారెడ్డి మామగారైన స్వర్గీయ మేడపాటి సీతారామరెడ్డి నగర అభివృద్ధికి  ఎంతో కృషి చేసారన్నారు. ఆయన కుటుంబంతో ఉన్న పరిచయాన్ని పద్మ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మేడపాటి షర్మిలారెడ్డి, అనిల్‌రెడ్డి దంపతులు వాసిరెడ్డి పద్మ, వెస్లీ దంపతులకు స్వాగతం పలికారు. వైసిపి మాజీ కార్పొరేటర్లు ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పార్టీ నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, పలువురు మహిళా నాయకురాండ్రు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here