షెల్టాన్‌లో ‘షీ’స్‌ ఎగ్జిబిషన్‌ సేల్‌ ప్రారంభం

0
471
రాజమహేంద్రవరం, జులై 25 :  జెసిఐ రాజమండ్రి, పెరల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో హొటల్ షెల్టాన్‌లో ‘షీ’స్‌ ఎగ్జిబిషన్‌ కం సేల్‌ ప్రారంభం అయ్యింది. ముందుగా ఎగ్జిబిషన్‌ను ఎంపీ మాగంటి మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప ప్రారంభించారు. జెసి హేమశంకర్‌, జెసి డాక్టర్‌ మురళీ మోహనరావులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ అధ్యక్షురాలు జెసి సౌమ్య సిద్ధార్ధ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌లో 25 రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల మదిని దోచేలా అనేక రకాల చీరలు, డ్రెస్‌లు, అలంకరణ సామాగ్రి, హ్యాండ్‌ బ్యాగ్స్‌, ఫ్యాన్సీ నగలు, వెండి సామాగ్రి, బంగారు నగలు మొదలైనవి ఈ ప్రదర్శనలో విక్రయాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌ 25, 26 తేదీల్లో రెండు రోజులు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చిన సొమ్ముతో సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జోన్‌ అధ్యక్షులు జెఎఫ్‌పి వివి రాహుల్‌  మాట్లాడుతూ జెసీ పెరల్స్‌ సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించారు.  క్లబ్‌ కార్యదర్శి గ్రంధి పద్మ, కోశాధికారి పాబోలు శ్రీదేవి, కోరుకొండ మహాతి, రామలక్ష్మి, యలమర్తి కీర్తనలు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ మాటూరి రంగారావు, నిమ్మలపూడి గోవింద్‌, తదతరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here