సంక్రాంతి వరకు నిత్యాన్నదానం

0
147
అయ్యప్ప ఆలయంలో పద్దెనిమి మెట్లకు పంచలోహ తాపడం
ధర్మశాస్త ఆధ్యాతిక సంస్ధ వెల్లడి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 7 : విజయదశమి నాటి నుంచి  మకర సంక్రాంతి వరకు స్ధానిక పుష్కరఘాట్‌ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ధర్మశాస్త ఆధ్యాత్మిక సంస్ధ నిర్వాహకులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్లా శంకరరావు, పొలసానపల్లి హనుమంతరావు, తోట సుబ్బారావు, మంతెన కేశవరాజులు వెల్లడించారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ అయ్యప్ప, భవానీ, గోవింద, శివమాల, చండీ మాలలు వేసిన భక్తులకు ప్రతిరోజు అయ్యప్ప ఆలయంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు నేతృత్వంలో అయ్యప్పస్వామి ఆలయం నిర్మించుకుని ప్రారంభించిన నాటి నుండి ఆయన ఆలోచన మేరకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. చల్లా శంకరరావు మాట్లాడుతూ గతేడాది లక్ష 40 వేల మందికి అన్నదానం చేయడం జరిగిందని, ఈ ఏడాది లక్షా 50వేల మంది భక్తులకు అన్నదానం చేయాలని సంకల్పించామన్నారు. అన్నదాన కార్యక్రమానికి తొలి నాటినుంచి మంతెన కేశవరాజు ఏటా లక్ష రూపాయిలు విరాళం అందిస్తూ వస్తున్నారని, గత ఏడాది నుంచి దవులూరి రామకృష్ణ(గంటస్థంభం రామకృష్ణ) కూడా లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నారన్నారు. ఇతర భక్తులు అందించే విరాళాలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లుగా వేసి వాటిపై వచ్చే వడ్డీతో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తాన్ని రూ.2కోట్లకు చేర్చాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు మంతెన కేశవరాజు రూ.80 లక్షల వరకు వివిధ కార్యక్రమాలకు అందజేయడం జరిగిందని, ఆయన సేవలను కొనియాడారు. ప్రతి యేటా అన్నదానానికి రూ.లక్ష ఇవ్వడంతో పాటుగా ఏటా రూ.4లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్నారన్నారు. ధర్మశాస్త ఆధ్యాత్మిక సంస్ధ ద్వారా సేవ చేయడానికి అవకాశం కల్పించిన దివంగత జక్కంపూడి రామ్మోహనరావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జక్కంపూడి కుటుంబానికి స్వామి వారి కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది జనవరి 15న తిరువాభరణాలను రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఇంటి వద్ద నుంచి తీసుకురావడం జరుగుతుందని, సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆభరణాలను మోసుకుని వస్తారని వెల్లడించారు.  ధర్మంవైపు, నీతి, నిజాయితీలవైపు నడవాలన్నదే జక్కంపూడి ఆశయం అని, ఆ దిశగానే ధర్మశాస్త ఆధ్యాత్మిక సంస్ధ నడుస్తుందన్నారు. ఆలయం పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేసిన తర్వాత, జక్కంపూడి ఆశయాలైనా ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలపై దృష్టి పెడతామని వెల్లడించారు. పొలసానపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ధర్మశాస్త ఆధ్యాత్మి సంస్ధ ద్వారా సేవలు అందించడం పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. గత ఏడాది స్వామి వారి ఆలయ తలుపులకు వెండి తాపడం చేయించామని, ఈ ఏడాది గుమ్మాలకు కూడా వెండి తాపడం చేయిస్తున్నామన్నారు. అలాగే 18 మెట్లను కూడా పంచ లోహాలతో తాపడం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భక్తుల నుండి బంగారం, వెండి సేకరిస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి 18 మెట్లను పంచలోహాలతో తాపడం చేయిస్తామన్నారు. భక్తులు సహకరించాలన్నారు. దశమి నుండి సంక్రాంతి వరకు స్వాములకు సుచి, శుభ్రతతో భోజనం అందించాలని లక్ష్యంతో కృష్ణా జిల్లా నుంచి వంటవారిని తీసుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రి చుట్టుప్రక్కల స్వాములు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సింది ఇంకా వుందన్నారు. భక్తులు తాకిడి పెరిగితే స్వామి వారికి ఆదాయం పెరుగుతుందని, తద్వారా ఇంకా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఇక్కడ సేవ చేసే భాగ్యం కలిగించిన జక్కంపూడి రామ్మోహనరావుకు ధన్యవాదాలు తెలిపారు. అయ్యప్ప దేవాలయం ప్రారంభించిన నాటి నుండి నిత్యం గణపతి ¬మం జరుగుతుందన్నారు. మరింతగా అభివృద్ధి జరిగితే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చేందుకు అవకాశం కలుగుతుందన్నారు. విలేకరుల సమావేశంలో ఇమంది కన్నారావు, దవులూరి రామకృష్ణ, నక్కెళ్ళ బాబూరావు, చలపతి గురుస్వామి, బర్ల సత్యనారాయణ, మన్నె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here