సందడిగా.. సరదాగా.. ఉత్సాహంగా 

0
121
ఆట పాటలతో సాగిన ఆనంద ఆదివారం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24 : యువతీ యువకులు, చిన్నారుల న త్యాలు హ్యాపీ సండేలో ఆద్యంతం అలరించాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన హ్యాపీ సండే సరదాగా, సందడిగా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. నగరానికి చెందిన చిన్నారులతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చి తమ ప్రతిభను కనబరుస్తున్నారు. రాజానగరంలోని గైట్‌ కళాశాలలో మార్చి మొదటి వారంలో జరగనున్న మైత్రి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ విద్యార్థులు హ్యాపీ సండే కార్యక్రమానికి భారీగా చేరుకుని ఫ్లాష్‌ మోబ్‌ నిర్వహించారు. వివిధ సినీ గీతాలకు చక్కగా అభినయించారు. అమలాపురానికి చెందిన నాలుగవ తరగతి విద్యార్ధిని రాజులపూడి దుర్గాభవానీ రెండు ఆధ్యాత్మిక గీతాలకు భరతనాట్యాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. హ్యాపీ సండేకి ప్రత్యేక ఆకర్షగా నిలిచే గోదావరి బాయ్స్‌ బ ందం పాల్గొని వివిధ రకాల సినీ గీతాలకు స్టెప్పులు వేశారు. కోర్లమ్మపేట నగరపాలక సంస్థ పాఠశాల,కోటిలింగాల పేట నగరపాలక సంస్థ పాఠశాల,అన్నపూర్ణమ్మ పేట నగరపాలక సంస్థ పాఠశాల, మెరకవీధి నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్ధులు అందమైన వేషధారణతో వచ్చి చక్కని న త్యాలు ప్రదర్శించారు. మధు డాన్స్‌ స్కూల్‌ బ ందం, డాన్స్‌ మాస్టర్‌ విజయ్‌ తమ న త్యాలతో ఆహుతులను అలరించారు. రేడియో మిర్చి సారధ్యంలో స్విగ్గీ,రాపిడో బైక్స్‌ సంస్థలు హ్యాపీ సండేలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్ధులకు బహుమతులు సమకూర్చారు. ప్రధమ బహుమతిని అమలాపురానికి చెందిన రాజులపూడి దుర్గాభవాని, ద్వితీయ బహుమతిని అన్నపూర్ణమ్మ పేట నగరపాలక సంస్థ పాఠశాల,త తీయ బహుమతిని కోటిలింగాల పేట నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్ధులు గెలుచుకోగా కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, గొర్రెల సురేష్‌, మర్రి దుర్గాశ్రీనివాస్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో  పందిరి మహదేవుడు సత్రం డైరెక్టర్‌ నల్లం ఆనంద్‌,కొమ్మా రమేష్‌ పాల్గొనగా స్కూల్స్‌ పర్యవేక్షకులు దుర్గాప్రసాద్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నడిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here