సంస్థాగత ఎన్నికలకు సిద్దం కండి

0
141
పార్టీ శ్రేణులకు గోరంట్ల సూచన
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 :  రూరల్‌ మండలం తెలుగుదేశం పార్టీ విస్త త స్థాయి సమావేశం ఈరోజు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగింది. సంస్థాగత ఎన్నికల సందర్భంగా గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. వై.యస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వపాలనలో సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని,ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు వలస పోతున్నారని అన్నారు. చంద్రబాబు  పాలనలో ఉచిత ఇసుక పాలసీ తెచ్చి ఆదర్శంగా నిలిస్తే, జగన్మోహన్‌ రెడ్డి  ప్రభుత్వం ఒక్క రోజులో మద్యం పాలసీ తెచ్చి ఆరు నెలలు గడిచినా ఇసుక పాలసీ తీసుకురాలేక పోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాలిక శ్రీనివాస్‌, మార్ని వాసుదేవ్‌, గంగిన హనుమంతరావు, పినమరెడ్డి ఈశ్వరుడు, మత్సేటి ప్రసాద్‌,బొప్పన  నాగేశ్వరరావు, వాసిరెడ్డి బాబీ, మార్ని దొరబ్బాయి, దారా అన్నవరం, గోకా శ్రీను, సర్వే రాజు, నున్న కృష్ణ, గంగిన తిరుమలరావు, మన్యం పెద్దబాబు, ఎలిపే జాన్‌, బత్తి రత్నరాజు, కొండబాబు, బిక్కిన సాంబ, భీమరశేట్టి రమేష్‌, కామిని భాస్కర్‌, మామిడి నాగు, పెండాల్య రామకృష్ణ, పుక్కళ్ళ సత్తిబాబు, ఆళ్ళ ఆనందరావు,ధర్మరాజు, నీలి కోటేశ్వరరావు, మేకా సత్యనారాయణ, కసిరెడ్డి దుర్గ ప్రసాద్‌, మల్ల నూకరాజు, వెంకన్న, ముసిని శ్రీను, బండారు సత్తిబాబు, నిమ్మలపూడి రామకృష్ణ, వాకలపూడి సత్యనారాయణ, గాలి వెంకటేశ్వరరావు, ఖాసీమ్‌, ఉమర్‌, ముచ్చి నాని, దాసరి సాగర్‌, పెంట కుమారి, ఎల్‌ కృష్ణ, ఇళ్ల రాంబాబు, మల్లిపూడి శ్రీను, బాబ్జీ, చాపల వెంకట్రావు, గోర్ల అప్పారావు, కొత్తూరి దుర్గరావు, ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here