సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ అభ్యర్థుల అర్హత మార్కులను తగ్గించాలి

0
96
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 23 : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ అభ్యర్థుల అర్హత మార్కులను 47.5 శాతానికి తగ్గించాలని అంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఎపి బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు గోలి రవి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి అప్పారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల నియామక రాత పరీక్షలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అర్హత మార్కులను 45 నుంచి 37.5కు తగ్గించారని, తద్వారా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎంతో మేలు చేశారని అన్నారు. అయితే బీసీ అభ్యర్థులకు కూడా అర్హత మార్కులను ఐదు మార్కులు తగ్గించి 47.5 అర్హతగా పెట్టాలని కోరారు. తద్వారా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న సుమారు పది వేల గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో మరికొంతమంది బీసీలకు అవకాశం కల్పించిన వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దొమ్మేటి సోమశంకరం,పి.జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here