సబర్మతీ ఆశ్రమంలో జాతిపితకు గన్ని కృష్ణ నివాళి

0
356

రాజమహేంద్రవరం, జనవరి 30 : జాతిపిత మహత్మాగాంధీ 70 వ వర్ధంతి సందర్భంగా గుజరాత్‌లో ఒకప్పుడు మహత్మాగాంధీ కార్యక్షేత్రంగా ఉన్న సబర్మతి ఆశ్రమంలో ఆ మహనీయుడి స్మృతికి గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు సాగిస్తున్న నాలుగు రోజుల అధ్యాయన యాత్రలో భాగంగా ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్న ఆ బృందంలో ఒక్కరైన గన్ని కృష్ణ అనుకోకుండా అక్కడే ఉండటంతో ఈరోజు సబర్మతీ ఆశ్రమానికి వెళ్ళి గాంధీ స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ రథసారథి మహత్మాగాంధీ 1918 నుంచి 1930 వరకు అక్కడే జీవనం గడపగా సబర్మతీ నదీ తీరాన ప్రశాంతత, పవిత్రత ఉట్టిపడేలా మహాత్ముడి స్మృతులను పదిలపరుస్తూ అభివృద్ధి పర్చిన ఆశ్రమాన్ని సందర్శించి గాంధీ చిత్రపటం ముందు గన్ని నివాళులర్పించారు. గాంధీ ఉపయోగించిన చరఖాను, ఆయన ఉపయోగించిన ఇతర వస్తువులను తిలకించి తన్మయులయ్యారు. అక్కడ సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని నిక్షిప్తం చేస్తూ ప్రపంచానికే ఆదర్శనీయుడైన మహత్మాగాంధీ నెలకొల్పిన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించడం తనకెంతో స్ఫూర్తిని, పులకింతను, అపారమైన మధురానునుభూతిని కలిగించాయని గన్ని పేర్కొన్నారు. నేడు తన జీవితంలో మరిచిపోలేని రోజని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here