సబ్‌కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు

0
148
రాజమహేంద్రవరం,జూన్‌ 28 : నగరపాలకసంస్థ కమిషనర్‌గా పనిచేస్తున్న సుమిత్‌కుమార్‌ గాంధీకి రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన సిఎం సాయికాంత్‌ వర్మ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారిగా బదిలీపై వెళ్లడంతో ఈ నియామకం జరిగింది. సుమిత్‌కుమార్‌ గాంధీ ఈరోజు సబ్‌కలెక్టరేట్‌లో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు చేపడతామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here